అందరూ స్వదేశీ యాప్‌లను వాడాలి: మోదీ

30 Aug, 2020 11:53 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని, అందరూ స్వదేశీ యాప్‌లనే వాడాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. ఆదివారం మనకీ బాత్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతినుద్ధేశించి మోదీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారని కొనియాడారు. ప్రతి వేడుకను పర్యావరణహితంగా జరుపుకోవాలని చెప్పారు. చిన్నారులు ఆడుకునే వస్తువులను ప్రపంచస్థాయిలో తయారు చేయాలని, స్థానిక కళలు, కళాకారులను ప్రోత్సహించాలన్నారు. ( తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు )

గత నెల మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ఆయన కార్గిల్‌ యుద్ధవీరుల ధైర్య సాహసాలను స్మరించుకున్నారు. సాయుధ దళాల నైతిక స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడకూడదని, వారి ధైర్య సాహసాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని తెలిపారు. కార్గిల్‌ యుద్ధంలో సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ జరుపుకునే విజయ్‌ దివస్‌ (జూలై 26) కూడా ఇదే రోజు రావడంతో ప్రధాని ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. 1999లో ఇదే రోజు కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. స్నేహ హస్తం చాచిన భారత్‌కు ఆనాడు పాకిస్తాన్‌ వెన్నుపోటు పొడిచిందని ప్రధాని గుర్తు చేశారు. ‘అంతర్గత సమస్యల నుంచి తప్పించుకునేందుకు.. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే దుస్సాహసానికి పాక్‌ ఒడిగట్టింది’అన్నారు.

మరిన్ని వార్తలు