నేపాల్ విమాన ప్రమాదంపై మోదీ విచారం.. మృతుల కుటుంబాలకు సంతాపం

16 Jan, 2023 11:47 IST|Sakshi

న్యూఢిల్లీ: నేపాల్‍లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 72 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదం తనను బాధించిందని, ఎన్నో విలువైన ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు వాళ్లకు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు.

ఈ ఘటనలో చనిపోయిన ఐదుగరు భారతీయుల్లో నలుగురిని ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌కు చెందిన విశాల్ శర్మ, సోను జైశ్వాల్, అనిల్ రాజ్‌భర్, అభిశేస్ కుశ్వాహాగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

సీఎం యోగి ఆదేశాలు..
మృతులు యూపీ వాసులు కావడంతో వారి పార్థీవ దేహాలను రాష్ట్రానికి తీసుకురావాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. విదేశీ వ్యవహరాల శాఖతో సమన్వయం చేసుకుని త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు.

చదవండి: నేపాల్‌ విమాన దుర్ఘటన.. అయ్యో దేవుడా! ఏ ఒక్కరిని ప్రాణాలతో గుర్తించలేదు..

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు