ఆర్‌బీఐ నూతన పథకాలను ప్రారంభించిన ప్రధాని మోదీ

12 Nov, 2021 13:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ నూతనంగా తీసుకొచ్చిన రెండు పథకాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో రిజర్వ్ బ్యాంక్ పనిచేసిన విధానాన్ని అభినందించారు.

అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'ఈ దశాబ్దం దేశాభివృద్ధికి చాలా ముఖ్యమైనది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌బీఐ పాత్ర కూడా చాలా పెద్దది. అందుకు అనుగుణంగానే ఆర్‌బీఐ బృందం దేశం యొక్క అంచనాలను అందుకోగలదని నమ్మకం ఉంది. రిటైల్ డైరెక్ట్ పథకంతో, దేశంలోని చిన్న పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడికి సులభమైన, సురక్షితమైన మార్గాన్ని అందించింది. ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌ పథకం, వన్‌ నేషన్‌ వన్‌ అంబుడ్స్‌మన్‌ సిస్టమ్‌ ఈ రోజు బ్యాంకింగ్‌ రంగంలో రూపుదిద్దుకుంది. ఈ రోజు ప్రారంభించబడిన రెండు పథకాలు దేశంలో పెట్టుబడి పరిధిని విస్తరింపజేస్తాయి. ఈ పథకాలు మరింత సురక్షితమైనవి. పెట్టుబడిదారులకు క్యాపిటల్‌ మార్కెట్‌లను యాక్సెస్‌ చేయడాన్ని సులభతరం చేస్తాయి' అని ప్రధాని మోదీ అన్నారు.  

చదవండి: (నిఖిల్‌తో పెళ్లిపై నుస్రత్‌ సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు