డెన్మార్క్‌తో చర్చలు సఫలం

10 Oct, 2021 06:15 IST|Sakshi

ప్రధాని నరేంద్రమోదీ వెల్లడి

న్యూఢిల్లీ: డెన్మార్క్‌ ప్రధాని మెటె ఫ్రెడెరిక్‌సెన్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వెల్లడించారు.  ఆరోగ్య, వ్యవసాయ, నీటి నిర్వహణ, వాతావరణ మార్పు, పునరి్వనియోగ ఇంధనాల విషయంలో సహకారాన్ని మరింత పెంచుకునేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఇండో డెన్మార్క్‌ గ్రీన్‌ స్ట్రాటజిక్‌ భాగస్వామ్య పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. తాజాగా నాలుగు అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. గ్రీన్‌ టెక్‌పై శ్రద్ధపెడుతున్నందుకు మోదీని ఫ్రెడెరిక్‌సెన్‌ ప్రశంసించారు. ఆయన ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. పర్యావరణం– పురోగతి జంటగా ఎలా పయనిస్తాయో తమ భాగస్వామ్యమే ఉదాహరణ అన్నారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. 3 రోజుల పర్యటనకు ఆమె ఇండియాకు వచ్చారు. రాజ్‌ఘాట్‌ను సందర్శించి గాం«దీకి నివాళి అరి్పంచారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఇరు దేశాలు గతేడాది గ్రీన్ర్‌స్టాటజిక్‌ ఒప్పందాన్ని చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు