Karnataka Assembly Elections: హాట్‌టాపిక్‌గా ప్రధాని మోదీ బహిరంగ లేఖ! ఆ లేఖలో ఏముందంటే..

9 May, 2023 18:09 IST|Sakshi

కర్ణాటకలో మే10న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కర్ణాటక ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ విడుదలన చేసిన లేఖ హాట్‌టాపిక్‌గా మారింది. ఆ లేఖలో మోదీ.. కర్ణాటకలో 38 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీని బ్రేక్‌ చేసి.. వరుసగా రెండోసారి విజయఢంకా మోగించాలనే లక్ష్యంతోనే బీజేపీ ఈ ఎన్నికల బరిలోకి దిగుతోందన్నారు. నిజానికి కన్నడ నాట ఏ అధికార పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఈ మేరకు మోదీ ఆ లేఖలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు ఎల్లప్పుడూ నన్ను ప్రేమ ఆప్యాయతలతో ముంచెత్తారు.

ఇది నాకు దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భారతీయులమైన మనం మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. కర్ణాటక కూడా తన దార్శనికతను సాకారం చేసుకునేలా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ఆసక్తి కనబర్చింది. భారత్‌​ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, ముందుగా మొదటి మూడుస్థానాలకు చేరుకోవడమే తన తదుపరి లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. అదీకూడా కర్ణాటక వేగంగా 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగినప్పుడే  ఇది సాధ్యమవుతుంది.

అలాగే కర్ణాటకలోని ప్రజల పట్ల తమ పార్టీ నిబద్ధతను గురించి కూడా లేఖలో ప్రస్తావించారు. ఇంకా ఆ లేఖలో.. కరోనా మహమ్మారి సమయంలో తమ ఏలుబడిలోని కర్ణాటక ఏడాదికి సుమారు రూ. 90 వేల కోట్లకుపైగా విదేశీ పెట్టుబడులు పొందింది. ఇది గత ప్రభుత్వంలో కేవలం రూ. 30 వేల కోట్లు మాత్రమే. పెట్టుబడులు, పరిశ్రమల ఆవిష్కరణలతో సహా, విద్య, ఉపాధి, వ్యవస్థాపకత తదితరాల్లో కర్ణాటకాని నెం1 గా మార్చాలని అనుకుంటున్నాం. ఇది ఈ రాష్ట్ర ప్రతి పౌరుడి కలే. ఇదే తన కల.. అని లేఖలో వెల్లడించారు మోదీ.

ఈనేపథ్యంలోనే మోదీ శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సుమారు 26 కి.మీ రోడ్డు షో నిర్వహిచారు. ఇదిలా ఉండగా, కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 224. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

(చదవండి: ఓవైపు కన్నడనాట హోరాహోరీ.. మరోవైపు కాంగ్రెస్‌లో ఇంటి పంచాయితీ! పైలట్‌ వ్యాఖ్యల్లో అంతరార్థం?)

మరిన్ని వార్తలు