పీటర్‌సన్‌ ట్వీట్‌కు స్పందించిన మోదీ

4 Feb, 2021 11:36 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశం పలు దేశాలకు కోవిడ్‌-19 టీకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న భారత్‌ కరోనా వ్యాక్సిన్‌ను దక్షిణాఫ్రికాకు పంపించింది. దీనికి సంబంధించి ‘మేడ్ ఇన్ ఇండియా’ వ్యాక్సిన్లతో ఆ దేశంలో  ల్యాండ్ అయిన విమానం ఫోటోను భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తన ట్వీటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్‌సన్‌ స్పందిస్తూ.. ‘భారతదేశం రోజురోజుకు చాలా దయ, ఉదారభావం పెంపొందించుకుంటూ ప్రపంచ దేశాలకు కష్టకాలంలో సాయం అందిస్తోంది’ అని ట్వీటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

పీటర్‌సన్‌ ట్వీట్‌పై భారత ప్రధాన మంత్రి నర్రేంద మోదీ స్పందిస్తూ.. ‘భారత్‌పై మీరు చూపించే ప్రేమ, అభిమానం’కు చాలా ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ‘ప్రపంచం ముత్తం ఒక కుటుంబమని తాము ఎల్లప్పుడూ బలంగా నమ్ముతాం. కరోనా మహామ్మరిపై పోరాటం చేయటంలో తమ దేశం శక్తిని కూడదీసుకొని కీలక పాత్ర పోషిస్తోంది’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. పీటర్‌సన్‌ దక్షిణాఫ్రికాలో జన్మించి తర్వాత ఇంగ్లండ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ సాధించిన పలు విజయాల్లో ఈ మాజీ కెప్టెన్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. బాట్స్‌మెన్‌గా పలు మ్యాచుల్లో రాణించి ఇంగ్లండ్‌ జట్టును విజయ తీరాలకు తీసుకువెళ్లాడు.

మరిన్ని వార్తలు