‘గత ప్రభుత్వాలకు నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేదు’

11 Aug, 2021 21:11 IST|Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పాలన, రాజకీయంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేదని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బుధవారం భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చవల్‌గా మాట్లాడారు. తమ ప్రభుత్వం 2014 నుంచి పలు కీలకైన సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తుచేశారు. అదే విధంగా పాలన పరంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు పాలన, రాజకీయంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవకపోవటం వల్ల జీఎస్టీ సంస్కరణలు ఏళ్ల తరబడి నిలిచిపోయాయని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వవం జీఎస్టీని అమలు చేయటమే కాదు, రికార్డు స్థాయిలో పన్నులు వసూలు చేసినట్లు ప్రధాని మోదీ వివరించారు. ఈ సంస్కరణల మూలంగానే భారత్‌ రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించినట్లు పేర్కొన్నారు. కరో​నా మహమ్మారి కాలంలో ప్రజలుకు ఉపయోగపడే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భారత్‌ ఎకానమీ వృద్ధి నెమ్మదిగా పెరుగుతోందని తెలిపారు. దానికి పరిశ్రమలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాని పేర్కొన్నారు. పరిశ్రమలు నూతన లక్ష్యాలను ఏర్పరుచుకొని,  దేశం స్వావలబన దిశగా అడుగులు వేయాడానికి కృషి​ చేయాలని ప్రదాని మోదీ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు