కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రధాని మోదీ

1 Mar, 2021 07:48 IST|Sakshi

భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌ తొలి డోసు తీసుకున్న ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కొవిడ్‌ టీకా తొలి డోసు తీసుకున్నారు. కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. కరోనాపై పోరాడుతున్న ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకుని దేశాన్ని కరోనా రహితంగా చేయాలని పిలుపునిచ్చారు.

‘‘ఎయిమ్స్‌లో కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నాను. ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి మన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి చెప్పుకోదగినది. టీకా తీసుకోవడానికి అర్హత ఉన్నవారందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమంతా కలిసి కరోనా రహిత దేశాన్ని నిర్మిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
చదవండి:
మోదీపై ఆజాద్‌ ప్రశంసలు
గాంధీ కుటుంబానికి ‘కట్‌ మనీ’

 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు