ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్‌

6 Aug, 2022 04:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఫిలిప్పీన్స్‌ 17వ అధ్యక్షుడిగా జూన్‌లో బాధ్యతలు చేపట్టిన మార్కోస్‌ జూనియర్‌కు మోదీ అభినందనలు తెలిపారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై ఇద్దరు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో ఫిలిప్పీన్స్‌ పాత్ర కీలకమైందిగా భారత్‌ భావిస్తోందన్నారు. ఫిలిప్పీన్స్‌ అభివృద్ధికి భారత్‌ సంపూర్ణంగా సహకరిస్తుందని ప్రధాని తెలిపారు. రొడ్రిగో డ్యుటెర్టే స్థానంలో  ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా మార్కోస్‌ జూనియర్‌ జూన్‌ 30వ తేదీన బాధ్యతలు చేపట్టారు.  

మరిన్ని వార్తలు