మన నినాదం ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’

17 Nov, 2020 04:29 IST|Sakshi

స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు కొనసాగించండి

దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు 

రాజస్తాన్‌లో విజయ్‌ వల్లభ్‌ సురీశ్వర్‌ విగ్రహావిష్కరణ

జైపూర్‌/న్యూఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి, దేశీయ వ్యాపారులకు ఊతం ఇచ్చినట్లుగానే స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు కొనసాగించాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వోకల్‌ ఫర్‌ లోకల్‌ (స్థానికానికి మద్దతుగా గళమెత్తాలి) అనే సందేశాన్ని దశదిశలా వ్యాపింపజేయాలని కోరారు. ప్రఖ్యాత జైన మత బోధకుడు విజయ్‌ వల్లభ్‌ సురీశ్వర్‌ 151వ జయంతి సందర్భంగా రాజస్తాన్‌లోని పాలీ పట్టణంలో నెలకొల్పిన ఆయన విగ్రహాన్ని ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  జైన ఆచార్యుడు విజయ్‌ వల్లభ్‌ విద్య, మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారని మోదీ కొనియాడారు.

కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన పెంచడంలో మీడియా ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కరోనాపై పోరాటం విషయంలో ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో మీడియా ఒక విలువైన భాగస్వామి అని తెలిపారు. సోమవారం నేషనల్‌ ప్రెస్‌ డే సందర్భంగా ఆయన లిఖితపూర్వక సందేశం ఇచ్చారు. సానుకూలమైన విమర్శలు లేదా విజయగాధలను ప్రచారం చేయడం ద్వారా మీడియా ప్రజలకు మేలు చేస్తోందన్నారు.

మరిన్ని వార్తలు