షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ పేరు మారుస్తాం: మోదీ

9 Nov, 2020 04:50 IST|Sakshi

అహ్మదాబాద్‌: నౌకాయాన శాఖను విస్తరించి దాన్ని రేవులు, నౌకాయానం, జలరవాణా  శాఖగా పేరు మారుస్తామని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్‌లో రో–పాక్స్‌ ఫెర్రీ (నౌక) సర్వీసును ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఇది 370 కి.మీ దూరాన్ని ఇది 90 కిలోమీటర్లకు (సముద్ర మార్గం) తగ్గిస్తుంది. ‘ఆత్మనిర్భర్‌   కార్యక్రమంలో భాగంగా షిప్పింగ్‌ శాఖ పేరును మారుస్తున్నామని చెప్పారు. నీలి ఆర్థిక వ్యవస్థ కోసం సముద్ర రవాణాను బలోపేతం చేయాల న్నారు. నోట్ల రద్దు దేశంలో నల్లధనాన్ని తగ్గించేందుకు, పన్ను వ్యవహారాల్లో క్లిష్టత తొలగిపోవడానికి, పారదర్శకతను పెంపొందించేందుకు దోహద పడిందని మోదీ చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్‌ చేశారు. పన్నుల వ్యవహారాలు మెరుగుపడేందుకు, మెరుగైన పన్ను, జీడీపీ నిష్పత్తికి నోట్ల రద్దు ఎలా దోహదపడిందో తెలిపే గ్రాఫిక్‌ను షేర్‌ చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా