ఇంధన భద్రతతో స్వయం సమృద్ధి : మోదీ

26 Oct, 2020 19:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పునరుత్పాదక ఇంధనంతో భారత్‌ ఏడాదిలో రూ 24,000 కోట్లు ఆదా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత ఎనర్జీ ఫోరం వేదికను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ ఇంధన భద్రతతో స్వయం సమృద్ధి సాధించవచ్చని అన్నారు. కరోనా వైరస్‌తో ప్రపంచ ఎనర్జీ డిమాండ్‌ మూడోవంతు పడిపోయిందని, అయితే దీర్ఘకాలంలో భారత్‌లో ఇంధన వినియోగం రెట్టింపవుతుందని పేర్కొన్నారు. మన ఇంధన రంగం వృద్ధి దిశగా సాగుతున్నదని పునరుత్పాదక ఇంధన వినియోగంలో చురుకైన దేశంగా భారత్‌ వ్యవహరిస్తోందని అన్నారు.

భారత్‌ అతితక్కువ కార్బన్‌ ఉద్గారాలను కలిగిన దేశమని చెప్పుకొచ్చారు. ఇంధన వనరుల పరిరక్షణలో భారత్‌ పలు చర్యలు చేపడుతోందని చెప్పారు. గత ఆరేళ్లుగా 1.1 కోట్ల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశామని దీంతో ఏడాదికి 6000 కోట్ల యూనిట్ల ఇంధన ఆదా జరిగిందని పేర్కొన్నారు. ఇంధన ఆదాతో ఏటా 24,000 కోట్ల రూపాయల మేర ఇంధన ఖర్చులను మనం ఆదా చేశామని చెప్పారు. గ్యాస్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదిగేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. చదవండి : నిరంతరం రైతన్నకు మేలు

>
మరిన్ని వార్తలు