రాముడి కోసం.. నిద్రాహారాలలో కఠిన నియమాలు పాటిస్తున్న మోదీ

19 Jan, 2024 08:20 IST|Sakshi

లక్నో: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. మందిర నిర్మాణం నుంచి ప్రతి విషయంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. బీజేపీ పెద్దల ఆశయాల్లో ఒకటిగా ఉన్న రామమందిరం నిర్మాణం తన చేతులమీదుగా జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అప్పటికే పలుమార్లు చెప్పారు. అయోధ్య ఆలయ  గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందే జనవరి 12 అనుష్టాన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. నాటి నుంచి మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నారు.    

ప్రధాని నరేంద్రమోదీ నిత్యం కేవలం నేలపైనే నిద్రిస్తుస్తున్నారు. కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారు. 11 రోజుల ప్రత్యేక అనుష్టానంలో భాగంగా ఆయన కఠిన నియమాలు పాటిస్తున్నారు. సాత్వికాహారం స్వీకరిస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా రామనామం జపిస్తున్నారు. తన నివాసంలో రాముడికి పూజలు చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాన యజమానిగా మోదీ వ్యవహరించనున్నారు. జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్టతో మోదీ అనుష్టానం ముగుస్తుంది.

  

జనవరి 22న జరగనున్న అయోధ్య రాముని ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మొత్తంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 7,000 మంది హాజరుకానున్నారు. 100 మంది విదేశీ ప్రముఖులు కూడా ఈ వేడుకకు రానున్నారు. 

ఇదీ చదవండి: Ayodhya: గర్భగుడిలో బాలరాముని మొదటి చిత్రం

>
మరిన్ని వార్తలు