లవ్‌ యూ అంటూ దగ్గరై.. వీడియో కాల్‌లో నగ్న వీడియో సేవ్‌ చేసుకొని..

29 Jul, 2022 07:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు: దేశంలో ప్రతీరోజు ఏదో ఒకచోట యువతులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నగ్నంగా నిలబడి వీడియో కాల్‌లో మాట్లాడమని చెప్పి రికార్డు చేసుకుని ఓ విద్యార్థినిని బెదిరిస్తున్న యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. కోవై సమీపంలో ఉన్న కోవిల్‌ పాళయంకు చెందిన 16 ఏళ్ల విద్యార్థిని ప్లస్‌ వన్‌ చదువుతోంది. 10వ తరగతి చదువుతున్న సమయంలో అదే తరగతిలో చదువుతున్న విద్యార్థితో పరిచయం ఏర్పడింది. అతను పదో తరగతి ఫెయిల్‌ కావడంతో చదువు ఆపేశాడు. ఆ తరువాత వారిద్దరూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుకునేవారు. విద్యార్థినిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో వీడియో కాల్‌లో మాట్లాడుకునేవారు. 

ఈ క్రమంలో ఓసారి నగ్నంగా నిలబడి వీడియో కాల్‌ చేయమని అతడు కోరడంతో వీడియో కాల్‌లో మాట్లాడినప్పుడు అతడు రికార్డు చేసుకున్నాడు. తరువాత కాలంలో పదేపదే వీడియో కాల్‌ చేయమని కోరడంతో ఆమె భయపడి తల్లిదండ్రులకు తెలిపింది. వారు కోవై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆ విద్యార్థినితో మాట్లాడుతున్న యువకుడు వివరాలు తెలియకపోవడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు తెలిపారు.  

ఇది కూడా చదవండి: రికవరీ ఏజెంట్ల దూషణలతో.. ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

మరిన్ని వార్తలు