ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌: మహిళా మావోయిస్టు మృతి

31 May, 2021 10:57 IST|Sakshi

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లో కాల్పుల మోత మోగింది. దంతెవాడ జిల్లా గుమల్నార్‌ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఘటనాస్థలంలో 2 కిలోల పేలుడు పదార్ధాలు, 2 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం 6.30 గంటలకు గీదాం పోలీసు స్టేషన్‌ పరిధిలో జిల్లా రిజర్వ్‌ గార్డు( డీఆర్‌జీ) పోలీసుల బృందం నక్సల్స్‌ ఏరివేత ఆపరేషన్‌ను చేపట్టినట్లు పోలీసు సూపరింటెండెంట్‌ అభిషేక్‌ పల్లవ తెలిపారు.

దీంతో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన మావోయిస్టు వైకో పెక్కో(24) అని పోలీసులు గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్‌ ఘటన రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 400 కిలో మిటర్ల దూరంలో చోటు చేసుకుంది.
చదవండి: భూవివాదం.. యువకుడిని కొట్టి చంపిన దుండగులు 

మరిన్ని వార్తలు