తల లేదు.. మొండెం మాత్రమే: క్లూ చెప్పండి, రూ.లక్షలు గెలవండి

23 Jun, 2022 18:25 IST|Sakshi

ఇద్దరు మహిళల హత్య కేసుల్లో మండ్య పోలీసుల ప్రకటన

మండ్య: జిల్లాలో ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల మృతదేహాల మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. హతులెవరు, హంతకులెవరు అనేది పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో ఈ మరణాలపై సమాచారం ఇస్తే బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ నెల 7వ తేదీన మండ్య జిల్లాలోని పాండవపుర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న బేబి గ్రామంలో ఉన్న చెరువులో సుమారు 30 సంవత్సరాల మహిళ మృతదేహం కనిపించింది.

మృతదేహానికి తల లేదు. మొండెం మాత్రమే ఉంది. ఇప్పటివరకు హతురాలు ఎవరో నిర్ధారణ కాలేదు. వివరాలను తెలిపిన వారికి రూ.లక్ష  బహుమానంగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అదేరోజు శ్రీరంగ పట్టణం తాలూకా అరికెరె పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీడీఎస్‌ కాలువ వద్ద నీటి గుంతలో 40 సంవత్సరాల మహిళ మృతదేహం కనిపించింది. ఆమెకు కూడా తల లేదు. ఇద్దరి దేహాలపై బట్టలు లేవు. ఈ మహిళ వివరాలు చెప్పినవారికి రూ.లక్ష నజరానాను ప్రకటించారు. 

చదవండి: (భర్త దగ్గరకు వెళ్లొద్దని చెప్పినా వినకుండా వెళ్లి..)

మరిన్ని వార్తలు