డాక్టర్‌ యోగిత హత్య కేసు నిందితుడు అరెస్ట్‌

20 Aug, 2020 14:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన డాక్టర్‌ యోగిత గౌతమ్‌(25) హత్య కేసులో అనుమానితుడిగా గుర్తించిన ఒక వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఆగ్రాలోని ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజీలో గైనకాలజీ విభాగంలో యోగిత గౌతమ్‌  వైద్యురాలిగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె సీనియర్‌ డాక్టర్‌ అయిన ఒక వ్యక్తి యోగితను పెళ్లి చేసుకుంటానని సంవత్సరం నుంచి వేధిస్తున్నాడని ఆమె తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి యోగిత సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గురువారం అతనిని అరెస్ట్‌ చేశారు.  మంగళవారం సాయంత్రం నుంచి యోగిత కనిపించపోవడంతో  కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆమె హత్యకు గురయినట్లు తెలిసింది. యోగిత మృతదేహం బమ్రోలి అహిర్‌ ప్రాంతంలో లభ్యమయ్యింది. ఆమె తలపై బలమైన రాడ్‌తో కొట్టడంతో మరణించినట్లు తెలుస్తోంది. 

ఈ విషయంలో పోలీసులు నిందితుడిని ప్రశ్నించగా యోగితతో ఏడు సంవత్సరాల నుంచి రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పాడని, మరింత లోతుగా దర్యాప్తు చేయగా నిందితుడు పోలిక లేని సమాధానాలు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ విషయంపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ స్పందిస్తూ డాక్టర్‌ యోగిత గౌతమ్‌ హత్య పట్ల విచారం వ్యకం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పట్టణాలలో, నగరాలలో , చివరికి పల్లెల్లో కూడా మహిళలకు రక్షణ లేకండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటేనే  క్రైమ్‌ ఉత్తరప్రదేశ్‌ని పాలిస్తున్నట్లు అర్థమవుతుంది అంటూ ట్వీట్‌ చేశారు. 

చదవండి: వైద్య విద్యార్థిని కిడ్నాప్‌, దారుణ హత్య

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు