తల్వార్‌తో కేక్‌ కటింగ్, ముగ్గురు అరెస్టు

5 Jun, 2022 09:25 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: పుట్టినరోజునాడు పెద్ద కత్తితో  కేక్‌ను కట్‌ చేసిన ముగ్గురిని ఉడుపి జిల్లా పడుబిద్రి పోలీసులు అరెస్టు చేసారు. జితేంద్రశెట్టి, గణేశ్‌ పూజారి, శరత్‌శెట్టి అరెస్టయిన యువకులు. మే 30న పడుబిద్రెలో జితేంద్రశెట్టి ఇంట్లో బర్త్‌డే సందర్భంగా తల్వార్‌తో కేక్‌ను కోశారు. ఈ వీడియోను వైరల్‌ చేయగా, పోలీసులు కేసు నమోదు పై ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. పెద్ద కత్తిని కలిగి ఉండడం, దానిని ప్రదర్శించడం చట్టరీత్యా నేరమవుతుంది.     

సినిమాలో నష్టపోయి రియాల్టీలో మోసాల
యశవంతపుర: స్థలాల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైన కేసులో సినీ నిర్మాత మంజునాథ్‌తో పాటు కేకే శివకుమార్, చంద్రశేఖర్, సీ శివకుమార్‌ అనేవారిని రాజాజీనగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిర్మాత మంజునాథ్‌ నటుడు కోమల్‌తో లొడ్డె అనే సినిమాను నిర్మించారు. ఇంకా విడుదల కాలేదు. కానీ సినిమా ద్వారా అతనికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభించి తక్కువ ధరలకు స్థలాలను ఇప్పిస్తామని ప్రకటన ఇవ్వటంతో అనేక మంది క్యూ కట్టారు. పలువురి నుంచి డబ్బులు కూడా కట్టించుకుని ఆఫీసుకు తాళం వేశారు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయడంతో మంజునాథ్‌ను, అనుచరులను అరెస్టు చేశారు.

(చదవండి: బాల్యం బడికి దూరం)

మరిన్ని వార్తలు