మహిళా కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌.. కారణం ఇదే..

3 Mar, 2023 08:54 IST|Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌కు చెందిన మహిళా కాంగ్రెస్‌ నేత మేఘనా పటేల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, విదేశీ మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న కేసులో ఆమెను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో​ దాదాపు రూ. 10లక్షల విలువైన మద్యాన్ని సీజ్‌ చేసినట్టు తెలిపారు. 

వివరాల ప్రకారం.. విదేశీ మద్యం అక్ర‌మ ర‌వాణా కేసులో మేఘనా పటేల్‌ను గుజరాత్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే, ఆమె.. తన బొలెరో కారులో విదేశీ మద్యం స్మగ్లింగ్‌ చేస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పిప్లాడ్‌ రోడ్డు ప్రాంతంలో మేఘనా పటేల్‌ కారును ఆపి చెక్‌ చేశారు. ఈ సందర్బంగా కారు నడుపుతున్న వ్యక్తిని తనిఖీ చేయగా.. మేఘనా పటేల్ కోసం రూ.7.5 లక్షలకు పైగా విలువైన విదేశీ మద్యం తీసుకొచ్చినట్లు తేలింది.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

దీంతో, విదేశీ మద్యాన్ని పోలీసులు సీజ్ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, ఈ విదేశీ మద్యం ఎక్కడ నుంచి వచ్చింది.. దీన్ని ఎవరు విక్రయించారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మేఘనా పటేల్‌, కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా, మేఘనా పటేల్ మాజీ మ‌హిళా ఉపాధ్య‌క్షురాలుగా ప‌ని చేశారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు