గణతంత్ర వేళ: తెలుగు రాష్ట్రాలకు పోలీస్‌ పతకాల పంట

25 Jan, 2021 13:23 IST|Sakshi

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతియేటా పోలీస్ పతకాలు ప్రకటించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం పోలీస్‌ పతకాలు ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి పోలీస్‌ మెడల్స్‌ తెలుగు రాష్ట్రాలకు భారీగా వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు పోలీస్‌ అధికారులకు ఈ పురస్కారాలు దక్కాయి. ఈ పతకాలను త్వరలోనే స్వీకరించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌:
18 పోలీస్ మెడల్స్‌, ఒక రాష్ట్రపతి విశిష్ట సేవ, 2 గ్యాలంట్రీ పతకాలు, విశిష్ట సేవ కేటగిరీలో 15 మందికి పతకాలు వచ్చాయి.

తెలంగాణ
14 పోలీస్‌ మెడల్స్‌, రాష్ట్రపతి విశిష్ట సేవ 2, విశిష్ట సేవ కేటగిరీలో 12 పతకాలు ప్రకటించారు. వీరిలో హైద‌రాబాద్ అద‌న‌పు సీపీ శిఖా గోయ‌ల్‌కు, నిజామాబాద్ ఐజీ శివ‌శంక‌ర్ రెడ్డి ఉన్నారు. 

ఆయా అధికారులు తమ విధుల్లో కనబర్చిన ప్రతిభకు ఈ పతకాలు దక్కాయి. పతకాలు పొందిన వారిని పోలీస్‌ ఉన్నతాధికారులు అభినందించారు. త్వరలోనే వీరు పతకాలు స్వీకరించనున్నారు.

మరిన్ని వార్తలు