Patiala Clashes: పంజాబ్‌లో టెన్షన్‌.. టెన‍్షన్‌.. ఇంటర్నెట్‌ సేవలు బంద్‌

30 Apr, 2022 10:52 IST|Sakshi

Patiala Clashes Punjab: పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాటియాలలో శివసేన కార్యకర్తలకు, ఖలిస్థాన్‌ మద్దతుదారులకు మధ్య శుక్రవారం ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాళీ మాత ఆలయం వెలుపల ఇరువర్గాల సభ్యులు కత్తులు ఊపుతూ ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.  తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం భగవంత్‌ మాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

శాంతిభద్రతల విషయంలో వైఫల్యం చెందడంతో ప్రభుత్వం రాష్ట్ర పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంది. హింసను నియంత్రించడంలో విఫలమైనందుకు డిపార్ట్‌మెంట్‌లోని ముగ్గురు ఉన్నతాధికారులను భగవంత్‌ మాన్‌ సర్కార్‌ తొలగించింది. పాటియాలా రేంజ్ ఐజి, పాటియాలా ఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీలను ఆ పదవి నుండి బదిలీ చేశారు. 

ఇదిలా ఉండగా.. ఘర్షణల కారణంగా శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాజియాలా జిల్లాలో శనివారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాయిస్ కాల్స్ మినహా మొబైల్ ఇంటర్నెట్, SMS సేవలను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఇప్పటికే నగరంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. 

ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా.. అంతకంతకు పెరుగుతున్న కేసులు

మరిన్ని వార్తలు