కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిపై ప్రశంసలు

30 Jul, 2020 20:02 IST|Sakshi

లక్నో: ‘ఖాకీలంటే కాఠిన్యమే కాదు.. జనాలను కాపాడే మానవత్వం కూడా ఉంటుంది. మాలోని ఈ కోణానికి నిదర్శనం ఈ వీడియో’ అంటూ ఉత్తరప్రదేశ్ ఎస్పీ రాహుల్‌ శ్రీవాస్తవ ఓ వీడియోను ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవ్వడమే కాక ప్రశంసలు కూడా పొందుతుంది. ఇందరి ప్రశంసలు పొందటానికి కారణం ఏంటంటే ఓ కానిస్టేబుల్‌ తన సమయస్ఫూర్తి, ధైర్యంతో ఓ ఇంటిని అగ్ని ప్రమాదం నుంచి కాపాడాడు. దాంతో నెటిజనులు సదరు కానిస్టేబుల్‌ని రియల్‌ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన సంభాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. (రోడ్డుపై తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం)

వివరాలు.. ఓ మతపెద్ద ఇంట్లో ఉన్న చిన్న సిలిండర్‌ నుంచి మంటలు వచ్చాయి. ఇది గమనించిన కానిస్టేబుల్‌ యోగేందర్‌ రాఠి వెంటనే స్పందించి లాఠీతో ఆ సిలిండర్‌ను కింద పడేస్తాడు. ఆ తర్వాత ఓ టవల్‌ను తడిపి సిలిండర్‌ మీద వేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ తతంగాన్ని సక్కనే ఉన్న వారు వీడియో తీశారు. దాదాపు ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను ఎస్పీ రాహుల్‌​ శీవాస్తవ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ‘కానిస్టేబుల్‌ ధైర్యం ఓ మత పెద్ద ఇంటిని కాపాడింది’ అంటూ షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. యోగేందర్‌ సమయస్ఫూర్తిని నెటిజనులు తెగ ప్రశంసిస్తున్నారు. రియల్‌ హీరో అంటూ మెచ్చుకుంటున్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు