పోలీసులు నా మెడ విరిచేందుకు ప్రయత్నించారు: కాంగ్రెస్‌ నాయకురాలి ఆరోపణ

21 Jun, 2022 21:08 IST|Sakshi

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ పథకాన్ని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీని ప్రశ్నించడాన్ని నిరసిస్తూ  కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే అల్కా లాంబా ఢిల్లీలో మంగళవారం నిరసన చేపట్టారు. అయితే తాను శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసుల తన మెడ విరిచే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

ఇందులో అల్కా లంబా రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి లేపేందుకు పోలీసులు ప్రయత్నించగా అల్కా రోడ్డుపై పడుకొని ‘భారత్ మాతా కీ జై, జై జవాన్, జై కిసాన్’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇంతలో పోలీసులు అంబాను ఎత్తుకుని అక్కడి నుంచి తరలించేందుకు యత్నించగా.. ఆమె మెడ విరగ్గొట్టేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ నాయకురాలు ఆరోపించారు. 
చదవండి: అగ్నిపథ్‌ స్కీమ్‌పై ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

‘నా మెడను ఎందుకు పట్టుకున్నారు. నన్ను ఒంటరిగా వదిలేయమని చెప్పండి. నా దగ్గర ఏం లేదు. నా దగ్గర AK-47 ఉందా? బాంబు ఉందా? నా వద్ద ఏ ఆయుధాలు లేవు’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిరసన ఆపాలని పోలీసులు ఎంత కోరినప్పటికీ . కాంగ్రెస్‌ నాయకురాలు ససేమిరా అన్నారు. తాను ఏ చట్టాన్ని ఉల్లంఘించడం లేదన్నారు. ఇదిలా ఉండగా నేషనల్ హెరాల్డ్ కేసులో  రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తన నిరసనను కొనసాగిస్తోంది. మంగళవారం నాడు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ఐదోసారి ప్రశ్నించారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ కేసుకు సంబంధించి జూన్ 23న ఏజెన్సీ ముందు హాజరు కావాలని కోరారు.

మరిన్ని వార్తలు