చూస్తుండగానే కూలిపోయింది.. పెద్ద ప్రమాదం తప్పింది

1 Jun, 2021 16:23 IST|Sakshi

ఇటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 415 జాతీయ రహదారి అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఇటానగర్‌లోని గాంధీ పార్క్‌ డీ సెక్టార్‌ వద్ద మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్డు కుంగిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

అయితే రహదారిపై వన్‌వేలో వాహనాలు అనుమతించడంతో ఘటన జరిగిన సమయంలో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. కాగా ఈ జాతీయ రహదారి ఇటానగర్‌-నహర్‌లాగున్‌లను కలుపుతుంది.తాజాగా ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.


చదవండి: మాకొద్దీ క‌రోనా ట్రీట్మెంట్‌, ప్రాణాలు పోతే పోనీ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు