పోస్టాఫీస్‌ ఖాతాదారులు ఇవి గుర్తుంచుకోండి!

7 Mar, 2021 22:23 IST|Sakshi

ప్రస్తుతం ఎన్నో రకాల పథకాలు పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో డబ్బులు జమ చేయడం వల్ల ఎటువంటి సమస్య లేకుండా కచ్చితమైన రాబడి పొందవచ్చు. అయితే, పోస్టాఫీస్‌లో ఖాతా కలిగిన వారు, ఇతర రకాల స్కీమ్స్‌లో చేరిన వారు కచ్చితంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఇండియా పోస్ట్ ఇటీవలే కొత్త రూల్స్ తీసుకోని వచ్చింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ రూల్స్ వల్ల పోస్టాఫీస్ ఖాతాదారులపై ప్రభావం పడనుంది. పోస్టాఫీస్ జీడీఎస్(గ్రామీణ్ డాక్ సేవ) బ్రాంచుల్లో వ్యక్తి గత ఖాతా నుంచి క్యాష్ విత్‌డ్రాయెల్ లిమిట్‌ను రూ.20,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే వడ్డీ రేటును కూడా సవరించింది. సేవింగ్ ఖాతా నగదుపై ఏడాదికీ 4శాతం వడ్డీ లభించనుంది.  

పోస్టాఫీస్ జీడీఎస్ బ్రాంచుల నుంచి రూ.5,000 కాకుండా ఇప్పుడు ఒక్కో కస్టమర్ రూ.20 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రోజుకు ఒక అకౌంట్‌లో రూ.50,000కు మించి డబ్బులు డిపాజిట్ చేయడానికి వీలు లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి స్కీమ్‌లలో డబ్బు డిపాజిట్ చేయడానికి విత్‌డ్రాయెల్ ఫామ్ లేదా చెక్ ఉపయోగించొచ్చు. అలాగే సేవింగ్స్ ఖాతా కలిగిన వారు కచ్చితంగా రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఒకవేళ మీ పోస్టాఫీస్ ఖాతాలోలో రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే.. అప్పుడు మీ ఖాతా నుంచి రూ.100 కట్ అవుతుంది. 

చదవండి:

మీ ఆధార్ ను ఎవరైనా వాడారా తెలుసుకోండిలా..?

కరోనా కాలంలో చైనాపై కాసుల వర్షం

మరిన్ని వార్తలు