పవర్‌గ్రిడ్‌లో ఫీల్డ్‌ ఇంజనీర్లు, సూపర్‌ వైజర్ ఉద్యోగాలు

20 Aug, 2021 20:12 IST|Sakshi

భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన మహారత్న సంస్థ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ ఇంజనీర్, సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (నిట్, వరంగల్‌లో 129 నాన్‌టీచింగ్‌ పోస్టులు)
► మొత్తం పోస్టుల సంఖ్య: 137

పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–48, ఫీల్డ్‌ ఇంజనీర్‌(సివిల్‌)–17, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రికల్‌)–50, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(సివిల్‌)–22.

అర్హత: ఫీల్డ్‌ ఇంజనీర్‌ పోస్టులకు కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌)/బీఈ(పవర్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.

వయసు: 27.08.2021 నాటికి 29 ఏళ్లు మించకుండా ఉండాలి.

వేతనం: ఫీల్డ్‌ ఇంజనీర్లకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000, ఫీల్డ్‌ సూపర్‌వైజర్లకు నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000లతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. (టీఎస్‌ఏసీఎస్‌లో ఉద్యోగాలు.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు)

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌(టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్, అప్టిట్యూడ్‌ టెస్ట్‌), పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021

► వెబ్‌సైట్‌:  http://www.powergrid.in

మరిన్ని వార్తలు