అడిగితేనే విద్యుత్‌ సబ్సిడీ ఇస్తాం: కేజ్రీవాల్‌

5 May, 2022 19:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉచిత, సబ్సిడీ విద్యుత్‌పై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడిగే వారికి మాత్రమే ఉచిత లేదా సబ్సిడీ విద్యుత్ ఇస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి వస్తుందని చెప్పారు.

‘చౌక విద్యుత్ అనేది ఇప్పుడు ఢిల్లీలో ఐచ్ఛికం. అంటే, వినియోగదారుడు విద్యుత్ సబ్సిడీని కోరుకుంటేనే ఇక నుంచి ఉచిత లేదా రాయితీతో కూడిన విద్యుత్‌ను పొందుతాడు. సబ్సిడీ అవసరం లేదకునేవారు సాధారణ రేటుకే కరెంటు ఉపయోగించుకుంటామని ప్రభుత్వానికి తెలపాలి. దీనికి సంబంధించిన కార్యాచరణ త్వరలో ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1 నుండి రాయితీతో కూడిన విద్యుత్‌ అడిగిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంద’ని కేజ్రీవాల్ వివరించారు. (చదవండి: వెనక్కి వెళుతున్న విమానంలా ఉంది)

ప్రస్తుతం ఢిల్లీలోని వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఎటువంటి బిల్లు లేదు. నెలకు 201 నుంచి 400 యూనిట్ల విద్యుత్‌పై రూ. 800 సబ్సిడీ ఇస్తున్నారు. ఉచిత విద్యుత్, నీటి పథకాలతో కేజ్రీవాల్‌ ఢిల్లీలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. పంజాబ్‌లోనూ దీన్ని అమలు చేస్తామని ఆయన హామీయిచ్చారు. విద్యా, వైద్య రంగాల్లోనూ ఢిల్లీ సర్కారు మంచి ప్రగతి సాధించడంతో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. (చదవండి: ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన ప్రకటన)

మరిన్ని వార్తలు