కాంగ్రెస్‌ పెద్దలతో ప్రశాంత్‌ కిశోర్‌ సమావేశం

19 Apr, 2022 05:57 IST|Sakshi

గత మూడు రోజుల్లో రెండోసారి భేటీ

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో 5 గంటలపాటు సమావేశమయ్యారు. ప్రియాంకా గాంధీ, అంబికా సోనీ, పి.చిదంబరం, జైరామ్‌ రమేశ్, కేసీ వేణుగోపాల్, రణదీప్‌ సూర్జేవాలా ఇందులో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నేతలతో పీకే భేటీ కావడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. ఈ ఏడాడి ఆఖర్లో జరగబోయే గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. పీకే త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారంటున్నారు. ఆయన శనివారం సోనియా గాంధీ సమక్షంలో పూర్తిస్థాయి ప్రజంటేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 370 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సూచించారు.

సోనియాతో మెహబూబా ముఫ్తీ భేటీ
కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సోమవారం సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారిద్దరూ చర్చించుకున్నట్లు తెలిసింది. దేశం ఇప్పటిదాకా భద్రంగా ఉందంటే అది కాంగ్రెస్‌ పార్టీ ఘనతేనని మెహబూబా ముఫ్తీ కితాబిచ్చారు. మరిన్ని పాకిస్తాన్‌లను సృష్టించాలని అధికార బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు