Prashant Kishor: కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌పై ప్రశాంత్‌ కిషోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

20 May, 2022 15:48 IST|Sakshi

సంస్థాగత మార్పులే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల చింతన్‌ శిబిర్‌ నిర‍్వహించిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ వేదికగా మూడు రోజుల పాటు ఈ భేటి జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాహుల్‌ గాంధీ పాదయాత్రతో సహా ఎన్నికలపై ఫోకస్‌పెట్టింది. 

కాగా, కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన కామెం‍ట్స్‌ చేశారు. పీకే.. కాంగ్రెస్ చింత‌న్ శిబిర్‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ.. అదో విఫ‌ల చింత‌న్ శిబిర్ అంటూ సటైర్లు వేశారు. ఈ శిబిర్‌ వల్ల కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి మార్పులు సంభవించవు. ఎప్పటిలాగే అదే పరిస్థితి ఉంటుందని ఎద్దేవా చేశారు. రాబోయే గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఓట‌మి చెందే వ‌ర‌కూ కాంగ్రెస్‌లో ఈ య‌థాతథ స్థితి ఇలాగే వుంటుంది అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

మరోవైపు.. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి కీలక నేతలు హ్యాండ్‌ ఇచ్చారు. గుజరాత్‌ పీసీసీ చీఫ్‌ హార్ధిక్‌ పటేల్‌, పంజాబ్‌ మాజీ పీసీసీ చీఫ్‌ సునీల్‌ జాకర్‌ సహా మరికొందరు నేతలు హస్తం పార్టీని వీడారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మరింత బలహీనపడింది. 

ఇది కూడా చదవండి: రాబోయే 25 ఏళ్లు బీజేపీవే.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!


 

మరిన్ని వార్తలు