yaas cyclone తుపాను బీభత్సం

26 May, 2021 17:02 IST|Sakshi

దిఘా: యాస్‌ తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని దిఘా పట్టణం వరద నీటిలో చిక్కుకుంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో పట్టణంలో రోడ్లన్నీ వాగుల్లా మారిపోయాయి. తుపాను, పౌర్ణమిచ చంద్రగ్రహణం అన్ని ఒకేసారి రావడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతంలో అలలు రెండు మీటరల​ ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. దీంతో సముద్రపు నీరు తీర ప్రాంతాల్లో ఉన్న ఊళ్లను ముంచెత్తుతోంది. వీటికి తోడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తీర ప్రాంతాలు జలవలయంలో చిక్కుకున్నాయి.

ధిఘా పట్టణంలో రోడ్లపైకి నడుము లోతుకి నీరు చేరుకోవడంతో వాహనాలు నీటిలో మునిగిపోయాయి. అనేక తీర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుకుంది. ముందుజాగ్రత్తగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 9 లక్షల మందిని తరలించినా...ఇంకా అనేక మంది తుపానులో చిక్కుకున్నారు

మరిన్ని వార్తలు