-

అతీక్‌ అహ్మద్‌కు జీవిత ఖైదు

29 Mar, 2023 05:45 IST|Sakshi

ఉమేశ్‌ పాల్‌ కిడ్నాప్‌ కేసులో కోర్టు తీర్పు

ప్రయాగ్‌రాజ్‌(యూపీ): 2006 నాటి ఉమేశ్‌పాల్‌ కిడ్నాప్‌ కేసులో గ్యాంగ్‌స్టర్‌–రాజకీయ నేత అతీక్‌ అహ్మద్, మరో ఇద్దరికి కఠిన జీవిత ఖైదు విధిస్తూ ఎంపీ–ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. తలా రూ.1 లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. అతీక్‌పై నమోదైన 100కు పైగా కేసుల్లో శిక్ష పడిన మొట్టమొదటి కేసు ఇదే. ఇదే కేసులో అతీక్‌ సోదరుడు ఖాలిద్‌ అజీం అలియాస్‌ అష్రఫ్, మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.

తీర్పుపై హైకోర్టుకు వెళతామని అతీక్‌ పోలీస్‌ వ్యాన్‌ నుంచి విలేకరులతో అన్నాడు. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు ముగ్గురినీ వేర్వేరు వ్యాన్లలో నైని జైలుకు తరలించారు. 2005లో జరిగిన బీఎస్‌పీ ఎమ్మెల్యే రాజు హత్య కేసులో అహ్మద్‌ తదితరులు నిందితులు. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ను అతీక్‌ కిడ్నాప్‌ చేసి, బెదిరించాడు. ఈ కేసులో అతీక్‌ జైలుపాలయ్యాడు.

మరిన్ని వార్తలు