ఆంబులెన్స్‌ రాలేదు, నిండు గర్భిణిని 3 కిలోమీటర్ల వరకు..

27 Jun, 2021 15:40 IST|Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: రహదారి సౌకర్యం లేకపోవడంతో ఓ గర్భిణిని స్థానికులు మూడు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లారు. ఆపై ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కాసీపూర్‌ సమితి కీరాఅంబొ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కీరాఅంబొ గ్రామానికి చెందిన కొసేయి మజ్జి భార్య బాసంతికి పురిటి నొప్పులు రావడంతో.. అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

అయితే, సరైన రహదారి లేకపోవడంతో ఆంబులెన్స్‌ను మూడు కిలోమీటర్ల దూరంలోనే నిలిపేశారు. దీంతో గర్భిణిని గ్రామస్తులు మోసుకుంటూ ఆంబులెన్స్‌ వద్దకు చేర్చారు. టకిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, బాసంతి ఆడశిశువుకు జన్మన్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామీణ రహదారులను మెరుగు పరచాలని గ్రామస్తులు కోరుతున్నారు. 
చదవండి: డెల్టా ప్లస్‌ డేంజర్‌ కాదు

మరిన్ని వార్తలు