మధ్యవర్తిత్వంతో న్యాయవ్యవస్థలో మార్పులు

10 Apr, 2022 06:29 IST|Sakshi

సీజేఐ జస్టిస్‌ రమణ

కెవాడియా (గుజరాత్‌): మధ్యవర్తిత్వంతో పాటు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం (ఏడీఆర్‌) యంత్రాంగాన్ని అమలు చేస్తే భారత న్యాయవ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో ఉండే కొన్ని చిక్కుముళ్ల వల్ల దీనికి విస్తృత స్థాయిలో ఆమోదం ఉండాలన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ కూడా కోర్టు కేసుల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర టెంట్‌ సిటీలో మధ్యవర్తిత్వం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో రాష్ట్రపతి కోవింద్, సీజేఐ జస్టిస్‌ రమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

మరిన్ని వార్తలు