సుప్రీం కోర్టులో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

26 Nov, 2023 11:55 IST|Sakshi

ఢిల్లీ: సుప్రీం కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్నిరాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ హాజరయ్యారు. 

అంబేద్కర్‌ విగ్రహాన్ని సుప్రీంకోర్టులో ఏర్పాటు చేయాలన్న అంబేద్కర్‌ మూమెంట్‌కు చెందిన కొందరు న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు సీజేఐ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆర్గూయింగ్‌ కౌన్సిల్‌ అసోషియేషన్‌(ఎస్‌సీఏసీఏ) కూడా సుప్రీం కోర్టులో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని సీజేఐకి విజ్ఞప్తి చేసింది. 

1949 నవంబర్‌ 26న కాన్‌స్టిట్యుయెంట్‌ అసెంబ్లీ ఆఫ్‌ ఇండియా రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసింది. అనంతరం రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. కాన్‌స్టిట్యుయెంట్‌ అసెంబ్లీ రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్‌26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.   

ఇదీచదవండి..దేశంలోని పలు రాష్ట్రాలకు వర్షసూచన

మరిన్ని వార్తలు