రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన రద్దు

11 Jul, 2022 18:44 IST|Sakshi

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్రౌపది ముర్ము.. రేపు(మంగళవారం) హైదరాబాద్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాల వల్ల ఆమె.. తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: ఇక తప్పదు రావాల్సిందే.. సోనియాకు ఈడీ నోటీసులు

మరిన్ని వార్తలు