ఈనెల 21 రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు

19 Jul, 2022 06:38 IST|Sakshi

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్‌..

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీలు ఓటేయగా.. రాష్ట్రాల అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలు 21న విడుదల కానున్నాయి. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► పార్లమెంట్‌లో ఓటేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ

► ఢిల్లీ ఆప్‌ ఎంపీ హర్భజన్‌ సింగ్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీలో పోలింగ్‌ జరుగుతోంది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ శశి థరూర్‌, దిగ్విజయ్‌  సింగ్‌, మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్కర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ధన్కర్‌ అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన ఉపరాష్ట్రపతి అవుతాడని తనకు ఖచ్చితంగా తెలుసన్నారు.

► ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసిన ఎన్సీపీ ఎమ్మెల్యే. గుజరాత్‌కు చెందిన ఏకైక ఎన్సీపీ ఎమ్మెల్యే కంధాల్‌ ఎస్‌ జడేజా ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, కాంగ్రెస్‌ ఎంపీ రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ
జయా బచ్చన్‌.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ

రాష్టపతి ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో కేంద్ర మంత్రులు మన్సుఖ్‌ మాండవీయ, హర్దీప్‌ సింగ్‌ పూరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితోపాటు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ ఢిల్లీలో ఓటేశారు. 

హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చండీగఢ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► కేరళ అసెంబ్లీలో ఓటు వేసిన ముఖ్యమంత్రి పినరయి విజయన్‌

► పార్లమెంట్‌లో ఓటు వేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా

 ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్‌ ధన్కర్‌

► ఓటు వేసిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

► భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీల్‌ చేర్‌ వచ్చిన మన్మోహన్‌ పార్లమెంట్‌లో తన ఓటు వేశారు. 

► పార్లమెంట్‌లో ఓటు వేసిన కేం‍ద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

► ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రులు.. 

► ఓటు వేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. అసెంబ్లీలో ఓటు వేశారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు సీఎం స్టాలిన్. ఆయన నేరుగా అసెంబ్లీకి వెళ్లి రాష్ట్రపతి ఎన్నిక కోసం ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

► రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. సోమవారం ఉదయం 10 గంటలకు పోలింగ్‌ను ప్రారంభించారు. ఎంపీలు పార్లమెంట్‌లో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో ఓటు వేయడం మొదలుపెట్టారు. సాయం‍త్రం 5 గం. వరకు ఓటింగ్‌ జరగనుంది.

► సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరుగుతుంది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేయలేవు. కాబట్టి క్రాస్‌ ఓటింగ్‌కు అవకాశముంటుంది.

 జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ లేనందున ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700కు తగ్గింది. ఇక ఎమ్మెల్యేల ఓటు విలువలో 208తో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. 176తో జార్ఖండ్, తమిళనాడు రెండోస్థానంలో, 175తో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. సిక్కిం ఎమ్మెల్యేల ఓటు విలువ అతి తక్కువగా 7గా ఉంది.  

 1971 జనాభా లెక్కల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువను నిర్ధారించారు. జనాభా, శాసనసభ స్థానాల ఆధారంగా ఎమ్మెల్యేల ఓటు విలువ ఉంది.

 గ్రీన్‌ బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎంపీలు, పింక్‌ బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

► ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌లో ఓటు వేయనున్నారు. 

► దేశ ప్రథమ పౌరుడు, 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం బ్యాలెట్‌ బ్యాక్సులను ఇప్పటికే రాష్ట్రాలకు తరలించింది. ఈ ఎన్నికల్లో  4,809 మంది ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం తమ ఓటు వేయనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. 21న పార్లమెంట్‌హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు.

మరిన్ని వార్తలు