వింత ఆచారం: కొరడాతో మహిళలను కొట్టి, ఈలలు వేస్తూ..

28 May, 2022 14:10 IST|Sakshi

స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చేశాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసింది. ఇలాంటి ఈ కంప్యూటర్‌ యుగంలో ఇంకా చాలామంది మూడనమ్మకాలను విశ్వసిస్తున్నారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఈ మూఢనమ్మకాల పేరిట చేస్తున్న హింసాత్మక ఆచారాలను కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికి పాటిస్తున్నారు. అన్నింటికంటే ఆశ్చర్యం ఏమిటంటే చదువుకున్న కొంతమంది కూడా వాటిని నమ్ముతుండటం కాస్త విస్మయానికి గురి చేస్తుంది. అచ్చం అలానే ఇక్కడొకప్రాంతంలో ఆచారం పేరిట మహిళలను కొరడాతో హింసిస్తుంటారు. 

వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని నమక్కల్‌ జిల్లాలోని ఒక పూజారి ‘కాటేరి’(చెడును దూరంగా ఉంచమని ప్రార్థించే దేవత)లా నల్లని దుస్తులను ధరించి మహిళలపై కొరడాతో కొడుతుంటాడు. ఆ పూజారి దృష్టిలో వాళ్లంతా చేతబడికి గురయ్యారని అర్థం. ఇతను అలా కొరడాతో కొడుతుంటే చుట్టు ఉన్న చుట్టు ఉన్న ప్రజలు ఈలలు వేస్తూ, అరుస్తే ఉత్సాహపరుస్తుంటారు. సదరు మహిళ ఆ పూజారికి చేతులెత్తి నమస్కరిస్తుంటే పూజారి దుష్టగాలి సోకకుండా ఉండేదు కోసం వారిని కొరడాతో కొడుతుంటాడు.

తాజా ఘటన నమక్కల్ జిల్లా వర్దరాజపెరుమాళ్ చెల్లియమ్మన్ మారియమ్మన్ ఆలయంలో చోటుచేసుకోవడంతో..అది వైరల్‌ అయ్యింది. ఐతే పూజారి ఇలా చేస్తే తమకెంతో మేలు జరుగుతుందని ప్రజలు చెబుతుండటం విశేషం. వాస్తవానికి రెండు వర్గాల మధ్య గొడవ కారణంగా గత 20 ఏళ్లుగా ఈ ఉత్సవాలు జరగలేదు. మళ్లీ ఇప్పుడే ఈ ఆలయంలో తొలిసారిగా ఈ వింత ఆచారానికి సంబంధించిన ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలను నెల రోజులు పాటు నిర్వహిస్తారు.

(చదవండి: పెళ్లైన కాసేపటికే వరుడికి షాకిచ్చి వధువు.. ఇజ్జత్‌ మొత్తం పోయింది)

మరిన్ని వార్తలు