భవ్య రామాలయం: పూజారికి బెదిరింపులు

4 Aug, 2020 13:44 IST|Sakshi

అయోధ్య : భవ్య రామ మందిర నిర్మాణానికి ముహూర్తం ఖ‌రారు చేసిన పూజారికి బెదిరింపు కాల్స్ రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల ప్ర‌కారం  క‌ర్ణాట‌క‌కు చెందిన 75 ఏళ్ల పూజారి ఎన్ఆర్ విజ‌యేంద్ర శ‌ర్మ ఆగ‌స్టు 5న జరుగనున్న రామ మందిర నిర్మాణం భూమిపూజ‌కు ముహార్తాన్ని నిర్ణ‌యించారు. బెళ‌గావిలో ఉండే విజ‌యేంద్ర శ‌ర్మ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు స‌భ్యుడు స్వామి గోవింద్ దేవ్ గిరిజకి స‌న్నిహ‌తులు. విజయేంద్రకు గ‌త మూడు,  నాలుగు రోజులుగా త‌న‌కు దాదాపు 60  బెదిరింపు ఫోన్ కాల్స్ వ‌చ్చిన‌ట్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి త‌న‌కు కాల్స్ వ‌చ్చిన‌ట్లు ఆయన పేర్కొన్నారు.
(150 నదుల జలాలతో అయోధ్యకు..)

దీంతో విజ‌యేంద్ర శ‌ర్మ ఇంటి ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు భారీ భ‌ద్ర‌త‌ను మోహ‌రించారు. గ‌తంలో మొరార్జీ దేశాయ్‌, అట‌ల్ బిహారీ వాజ్‌పేయిలకు, పీవీ న‌ర‌సింహ‌రావుల‌కు శ‌ర్మ స‌ల‌హాదారునిగా వ్య‌వ‌హ‌రించారు. అంతేకాకుండా వాజ్‌పేయి ప్ర‌ధానిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన సంద‌ర్భంలోనూ శ‌ర్మ‌నే ముహూర్తం పెట్టారు.  ఇక బుధవారం నాడు జరగనున్న భూమి పూజ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు మరికొంత మంది ప్రముఖులు హాజరు కానున్నారు.  కాగా, ఏప్రిల్‌లోనే రామాలయ నిర్మాణ వేడుక‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదాప‌డిన సంగతి తెలిసిందే.  
(అయోధ్య భూమి పూజకు మోదీ, షెడ్యూల్‌ ఇదే!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు