టొరంటో రోడ్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఫ్లెక్సి

11 Mar, 2021 16:47 IST|Sakshi

టొరంటో: మనదేశంలో తయారైన కరోనా టీకాలను ఇతర దేశాలకు అందిస్తూ భారత్‌ విశ్వగురు పేరును సార్థకం చేసుకుంటుంది. అందులో భాగంగా  కరోనా టీకాలను కెనడాకు అందించింది. గత వారం, కెనడాకు 500,000 మోతాదుల కోవిషీల్డ్ టీకాలను సరఫరా చేసింది. భారత్‌ చూపించిన ఔదర్యానికిగాను కెనడాలోని టోరంటో రోడ్లపై ‘థ్యాంక్యు ఇండియా, పిఏం నరేంద్ర మోదీ’ అంటూ ఫ్లెక్సిలు వెలిశాయి.

కెనడా, భారత్‌ మధ్య మైత్రి వర్ధిలాలని ఫ్లెక్సిలు ఏర్పాటు చేశారు.కెనడావాసులు కోవిడ్‌-19 వ్యాక్సిన్లను అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడంలో భారత్‌ ముందంజలో ఉంది. మిత్రదేశాలు,  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వంటి ప్రపంచ సంస్థల నుంచి మాత్రమే కాకుండా, బిల్‌గేట్స్‌ వంటి వ్యక్తుల నుంచి కూడా భారత్‌ ప్రశంసలను పొందింది.

కొన్ని రోజుల క్రితం,  ఇండియా-స్వీడన్ మధ్య జరిగిన వర్చువల్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 'మేడ్-ఇన్-ఇండియా' టీకాలు ఇప్పటివరకు 50 కి పైగా దేశాలకు సరఫరా చేశామన్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసే ప్రణాళిక వేస్తున్నామన్నారు. భారత్‌150 కి పైగా దేశాలకు మందులు, ఇతర అవసరమైన వస్తువులను అందించిందన్నారు.దీనితో పాటుగా, భారత్‌ తన అనుభవాలను, ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలను,  ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌, ఆ దేశ చట్టసభ సభ్యులతో పంచుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు.

>
మరిన్ని వార్తలు