త్వరలో మోదీ అమెరికా పర్యటన

2 Feb, 2023 04:30 IST|Sakshi

ఉభయసభలనుద్దేశించి ప్రసంగం!

ఇంకా ఖరారు కాని తేదీలు

వాషింగ్టన్‌: అమెరికా సందర్శనకు రావాలంటూ భారత ప్రధాని మోదీని అధ్యక్షుడు బైడెన్‌ ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని నరేంద్ర మోదీ అంగీకరించారు. ఇద్దరు నేతలకు అనుకూలించే తేదీలను ఖరారు చేసేందుకు రెండు దేశాల అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. జి–20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్, సెప్టెంబర్‌లో జరిగే శిఖరాగ్రానికి అవసరమైన సన్నాహక సమావేశాలు జరుపుతోంది. శిఖరాగ్రానికి బైడెన్‌ కూడా రానున్నారు.

అంతకుముందుగానే ప్రధాని మోదీ జూన్‌ లేదా జూలైలో అమెరికాలో పర్యటనకు వెళ్లేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడే పర్యటనకు వెళ్తే ఉభయ సభల సమావేశంలోనూ ఆయన ప్రసంగించేందుకు వీలుంటుందని వైట్‌çహోస్‌ వర్గాలు తెలిపాయి. . ఇది తప్పితే,  ఆ తర్వాత మళ్లీ రాష్ట్రాల ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో మోదీ బిజీగా ఉంటారు. అయితే, అమెరికా రావాలంటూ ప్రధాని మోదీకి బైడెన్‌ ఆహ్వానం ఎప్పుడు పంపారనే విషయాలను వెల్లడించేందుకు విశ్వసనీయ వర్గాలు నిరాకరించాయి. బైడెన్‌ అధ్యక్షుడయ్యాక గత డిసెంబర్‌లో ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్‌కు మొదటి అధికారిక విందు ఇచ్చారు. 

మరిన్ని వార్తలు