‘మన్‌ కీ బాత్‌’లో ప్రసంగించిన ప్రధాని మోదీ

27 Sep, 2020 12:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చని, ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన గురువారం దేశంలోని పలు అంశాలపై ‘మన్‌ కీ బాత్’‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. పంచతంత్ర కథల్లో ఎంతో నీతి దాగి ఉందని తెలిపారు. ప్రస్తుతం సైన్స్‌, సైన్స్‌ ఫిక్షన్‌ కథలు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎందరో స్ఫూర్తిదాయకమైన కథలు చెప్పేవారు ఉన్నారని తెలిపారు. మంచి కథల ద్వారా సంస్కృతి, సంస్కారం తెలుస్తుందని చెప్పారు. ప్రతి వారం ఒక టాపిక్‌ ఎంచుకోవాలని, కరోనా సమయంలో రైతులు మన కోసం ఎంతో కష్టపడుతున్నారని గుర్తు చేశారు. (అప్పటి, ఇప్పటి పరిస్థితులేంటి? : మోదీ)

ఆత్మనిర్భర్‌ భారత్‌ ద్వారా రైతులకు సాయం అందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని, వ్యవసాయంతో గ్రామాల్లో ఉండే వారికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. రేపు (సోమవారం) భగత్‌సింగ్‌ జయంతిని ఘనంగా జరుపుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భగత్‌సింగ్‌ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చుని, ఇళ్లలోని పెద్దలు తమ అనుభవాలు పిల్లలకు చెప్పాలని కోరారు. ఈ కార్యకమంలో భాగంగా బెంగళూరు స్టోరీ టెల్లింగ్‌ సొసైటీ అపర్ణాతో మాట్లాడిన మోదీ ముచ్చటించారు. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’లో పలు సామాజిక అంశాలు, దేశ పరిస్థితులపై ప్రసంగిస్తారన్న విషయం తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు