అమెరికాకు ప్రధాని మోదీ

23 Sep, 2021 05:18 IST|Sakshi
అమెరికాకు విమానంలో వెళ్తూ పెండింగ్‌ ఫైళ్లను పరిశీలిస్తున్న ప్రధాని మోదీ

ఐదు రోజులు పర్యటించనున్న ప్రధాని 

బైడెన్, కమలా హ్యారిస్‌తో చర్చలు 

క్వాడ్, యూఎన్‌ సర్వప్రతినిధి సభకు హాజరు

వ్యూహాత్మక సంబంధాల బలోపేతం కోసమేనన్న మోదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఐదు రోజుల అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అమెరికాతో పాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని తెలిపారు. అమెరికాకు బయల్దేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఒక ప్రకటనను విడుదల చేశారు. కోవిడ్‌ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్‌ సదస్సులో దృష్టి పెడతామని వెల్లడించారు. ‘‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహా్వనం మేరకే అక్కడికి వెళుతున్నాను.

22–25 వరకు యూఎస్‌ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో జో బైడెన్‌తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకుంటాం’’అని మోదీ చెప్పారు. ఈ పర్యటనలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను కూడా కలుసుకొని ఇరు దేశాల మధ్య పరస్పర సహకారానికి గల అన్ని అవకాశాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు.  

గగనతలం వినియోగానికి పాక్‌ ఓకే: అమెరికాకు వెళ్లిన ప్రధాని మోదీ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాకిస్తాన్‌ అనుమ తించింది. కశీ్మర్‌లో ఆరి్టకల్‌ 370 రద్దు తర్వాత ప్రధాని, రాష్ట్రపతి విదేశాలకు వెళితే తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాక్‌ నిరాకరిస్తూ వచి్చంది. దీంతో పాక్‌ ధోరణిపై భారత్‌ ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీఎఒ)లో తన నిరసన గళాన్ని వినిపించింది. అఫ్గానిస్తాన్‌ గగనతలం సురక్షితం కాదు కాబట్టి ఈసారి మోదీ విమానానికి పాక్‌ అనుమతించింది.

వరుస సమావేశాలతో ప్రధాని బిజీ
► సెపె్టంబర్‌ 23న (గురువారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలోని వాషింగ్టన్‌లో మేజర్‌ కంపెనీల సీఈవోలతో సమావేశమై చర్చించనున్నారు. క్వాల్‌కామ్, అడోబ్, ఫస్ట్‌ సోలార్, ఆటమిక్స్, బ్లాక్‌స్టోన్‌ కంపెనీల సీఈవోలతో చర్చిస్తారు. అదే రోజు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌తో ముఖాముఖి చర్చలు జరుపుతారు.
► సెపె్టంబర్‌ 24న (శుక్రవారం) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వైట్‌హౌస్‌లో చర్చలు జరుపుతారు. అఫ్గానిస్తాన్‌ పరిణామాలు దాని ప్రభావం, సీమాంతర ఉగ్రవాదం, పెరిగిపోతున్న చైనా ఆధిపత్యం, భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చిస్తారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తోనూ భేటీ అవుతారు. జపాన్‌ ప్రధాని యోషిహిడో సుగాతో విడిగా చర్చలు జరుపుతారు. అదే రోజు అమెరికా, భారత్, ఆ్రస్టేలియా, జపాన్‌ దేశాలతో కూడి న క్వాడ్‌ సదస్సులో పాల్గొంటారు. ఆ సమావేశం ముగిశాక న్యూయార్క్‌ బయల్దేరి వెళతారు.
► 25న (శనివారం) ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు భారత్‌కు తిరుగు ప్రయాణమవుతారు.  
► సెప్టెంబర్‌ 26 (ఆదివారం ) భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంటారు.

>
మరిన్ని వార్తలు