చింతన్‌ శిబిర్‌: సోనియాకు సూపర్‌ ట్విస్ట్‌ ఇచ్చిన హస్తం నేతలు

14 May, 2022 21:20 IST|Sakshi

కాంగ్రెస్‌ సంస్థాగత మార్పుల కోసం రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్లో చింతన్‌ శిబిర్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చింతన్‌ శిబర్‌ జరుగుతున్న రెండో రోజును అనుహ్య డిమాండ్‌కు కాంగ్రెస్‌ నేతలు తెరలేపారు. 

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా తనయ ప్రియాంక గాంధీని నియమించాలని హస్తం పార్టీ ప్రతినిధుల నుంచి డిమాండ్‌ రావడంతో హైకమాండ్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే, ఉదయం మీటింగ్‌లో భాగంగా రాహుల్‌ గాంధీనే పార్టీ అధ‍్యక్షుడిగా కొనసాగాలని పట్టుబట్టిన నేతలంతా సడెన్‌గా సాయంత్రానికి మాటమార్చారు. కాగా, ఈ సమయంలో హైక‌మాండ్ నుంచి మాత్రం ఎలాంటి స్పంద‌నా రాకపోవడం విశేషం. 

మరోవైపు.. రాహుల్ గాంధీకి కాం‍గ్రెస్‌ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డానికి ఇష్టం లేకపోతే.. ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ప్రియాంక గాంధీని పార్టీ అధ్య‌క్షురాలిగా ప్ర‌క‌టించాల‌ని నేత‌లు డిమాండ్ చేశారు. ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో సోనియా, రాహుల్‌, ప్రియాంక అక్కడే ఉన్నప్పటికీ సైలెంట్‌గా ఉన్నారు. తాజాగా తెర మీదకు ప్రియాంక గాంధీ పేరు రావడంతో హైకమాండ్‌కు కొత్త తలనొప్పి స్టార్ట్‌ అయ్యింది. 

ఇది కూడా చదవండి: శరద్‌ పవార్‌పై అనుచిత పోస్ట్‌ షేరింగ్‌.. నటిపై కేసు

మరిన్ని వార్తలు