స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ నినాదాలు

7 Jun, 2021 02:45 IST|Sakshi

అమృత్‌సర్‌: పంజాబ్‌లో సిక్కుల ప్రధాన దేవాలయమైన గోల్డెన్‌ టెంపుల్‌లో ఆదివారం ఖలిస్తాన్‌ నినాదాలు వినిపించాయి. 1984లో జరిగిన ఆపరేషన్‌ బ్లూ స్టార్‌లో భాగంగా గోల్డెన్‌టెంపుల్‌లో నక్కిన ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు 37 ఏళ్లు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ఖలిస్తాన్‌ మద్దతు నినాదాలు వినిపించాయి. ఇందులో నినాదాలు చేసిన వారు శిరోమణి అకాలీదళ్‌ (మన్‌)కు చెందిన వారు కావడం గమనార్హం.

జనవరి 26న రైతుల ట్రాక్టర్‌ మార్చ్‌లో జరిగిన హింసకు బాధ్యుడని భావిస్తున్న దీప్‌ సిద్దూ.. మాజీ ఎంపీ సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ మన్‌తో కలసి ఈ సమావేశంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ సందర్భంగా జతేదార్‌ హర్‌ ప్రీత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ గాయాలను సిక్కు వర్గం ఇంకా మర్చిపోలేదన్నారు. 

మరిన్ని వార్తలు