నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ-51

28 Feb, 2021 11:59 IST|Sakshi

సూళ్లూరుపేట/తిరుమల/శ్రీకాళహస్తి: శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది.  పీఎస్‌ఎల్‌వీ సీ 51 ద్వారా బ్రెజిల్‌ దేశానికి చెందిన అమెజానియా–1 ఉపగ్రహం(637 కిలోల బరువు), అమెరికాకు చెందిన స్పేస్‌ బీస్‌ ఉపగ్రహాల శ్రేణిలో 12, సాయ్‌–1 నానో కాంటాక్ట్‌–2 ఉపగ్రహాలు, న్యూ స్పేస్‌ ఇండియా పేరుతో భారత ప్రైవేట్‌ సంస్థలకు చెందిన సతీష్‌ ధవన్‌ శాట్, సింధు నేత్ర, దేశంలోని మూడు వర్సిటీలకు చెందిన శ్రీ శక్తి శాట్, జిట్‌ శాట్, జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌లను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. వీటిలోని ఒక శాటిలైట్‌లో తొలిసారిగా మోదీ ఫొటో, భగవద్గీత అంతరిక్షంలోకి పంపిస్తున్నారు.

వైఎస్ జగన్ అభినందనలు..
ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
 


 

మరిన్ని వార్తలు