పుణే మెట్రోలో సైకిళ్లకు అనుమతి

28 Aug, 2021 15:52 IST|Sakshi

పింప్రి(మహారాష్ట్ర): పుణే మెట్రోలో ప్రయాణించేవారు ఇకపై తమ వెంట సైకిళ్లను కూడా తీసుకువెళ్లవచ్చని మెట్రో ఎండీ బ్రిజేష్‌ దీక్షిత్‌ వెల్లడించారు. దీంతో మెట్రో రైలులో ప్రయాణించిన తరువాత ఆటోలు, బస్సుల కోసం వేచిచూడాల్సిన అవసరముండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ఎంతోమందికి మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. సైకిళ్ల కారణంగా పర్యావరణానికి హాని జరగకపోవడమే గాక రోడ్లపై ట్రాఫిక్‌ కూడా తగ్గుందని వివరించారు. (చదవండి: ప్యాసింజర్‌ రైళ్ల వల్లే నష్టాలు.. ఇదేం చోద్యం?)

సాధారణంగా ప్రజలు మెట్రో స్టేషన్‌కు రావాలన్నా, ఇక్కడి నుంచి వేరేచోటికి వెళ్లాలన్నా ఆటోలు, బస్సులను ఆశ్రయిస్తారు. దీని కారణంగా రోడ్డుపై ట్రాఫిక్‌ పెరగడంతో పాటు ఎక్కువ ఖర్చు అవుతుంది. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. అలాంటి వారు తమ వెంట సైకిల్‌ తెచ్చుకుంటే మెట్రో స్టేషన్‌కు చేరుకోవాలన్నా, రైలు దిగిన తరువాత తమ గమ్యస్థానాలకు వెళ్లాలన్నా సైకిళ్లు ఎంతో దోహద పడతాయని బ్రిజేష్‌ దీక్షిత్‌ అభిప్రాయపడ్డారు.   

మరిన్ని వార్తలు