New Punjab AAP Cabinet: పంజాబ్‌లో కొలువు దీరిన ఆప్‌ సర్కార్‌.. కేబినెట్‌ మంత్రులు వీరే..

19 Mar, 2022 13:53 IST|Sakshi

చంఢీగఢ్‌: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సర్కార్‌ కొలువుదీరిసింది. చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మంత్రివర్గంలో 10 మందిని తీసుకోగా.. ఒకే ఒక్క మహిళకు ప్రస్తుతం చోటు లభించింది. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈరోజు కొత్తగా ఏర్పడిన కేబినెట్‌తో ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ తొలి సమావేశం నిర్వహించనున్నారు.

శనివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో..  హర్పాల్ సింగ్ చీమా, డాక్టర్ బల్జీత్ కౌర్, హర్బజన్ సింగ్, డాక్టర్ విజయ్ సింగ్లా, లాల్ చంద్, గుర్మిత్ సింగ్, కుల్దీప్ సింగ్ ధలివాల్‌, లల్‌జిత్‌ సింగ్ భుల్లార్, బ్రామ్ శంకర్(జింపా), హర్జోత్‌ సింగ్ బెయిన్స్‌లు ఉన్నారు. కొత్త కేబినెట్‌లో హర్జోత్ సింగ్ బెయిన్స్ అత్యంత యువ మంత్రి కావడం విశేషం.
చదవండి: కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!

కాగా శుక్రవారం ట్విట్టర్ ద్వారా తన మంత్రుల జాబితాను ప్రకటించిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వారికి అభినందనలు తెలిపారు అలాగే పంజాబ్‌ ప్రజలకు నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించడానికి మంత్రులు కష్టపడి పనిచేయాలని సూచించారు.
చదవండి: పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం.. ఇంతలోనే వివాదంలో సీఎం భగవంత్‌ మాన్‌..!

ఇక  ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గానూ ఆమ్‌ ఆద్మీ పార్టీ 92 సీట్లు వైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌, శిరోమణి అకాలీదళ్‌ కాకుండా పంజాబ్‌లో తొలిసారి మరో పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ విప్లవవీరుడు భగత్ సింగ్ స్వగ్రామమైన ఖాట్కర్ కలాన్‌లో ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు.

మరిన్ని వార్తలు