సీఎం జగన్‌ బాటలోనే పంజాబ్‌ ప్రభుత్వం

3 May, 2022 16:41 IST|Sakshi

చండీగఢ్‌: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణ పొందిన ‘ఇంటివద్దకే రేషన్‌ సరుకుల పంపిణీ’ పథకాన్ని పంజాబ్‌ ప్రభుత్వం అందిపుచ్చుకుంది. లబ్ధిదారులకు ఇళ్ల వద్దే రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 26,000 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

అలాగే ముక్తసర్‌ జిల్లాలో పత్తి రైతులకు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.41.89 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. కేబినెట్‌ నిర్ణయం మేరకు రాష్ట్రంలో అక్టోబర్‌ 1 నుంచి గోధుమ పిండితోపాటు ఇతర సరుకులను హోం డెలివరీ చేయనున్నారు. మొబైల్‌ ఫెయిర్‌ ప్రైస్‌ షాప్స్‌(ఎంపీఎస్‌)గా పిలిచే రవాణా వాహనాల్లో రేషన్‌ సరుకులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేరవేస్తారు. 

చదవండి👉🏾 (సీఎం జగన్‌ బాటలో స్టాలిన్‌.. తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ)

మరిన్ని వార్తలు