తీవ్ర విమర్శలు.. ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్న పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌

3 Jun, 2022 07:42 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఎట్టకేలకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసే వాలా హత్య నేపథ్యంలో పంజాబ్‌లో వీఐపీలందరికీ భద్రతను పునరుద్ధరించనున్నట్లు గురువారం ప్రకటించారు.

జూన్‌ 7వ తేదీలోగా ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటామని పంజాబ్, హరియాణా హైకోర్టుకు భగవంత్‌మాన్‌ సర్కార్‌ గురువారం నివేదించింది. భవిష్యత్తులో మళ్లీ ఈ నిర్ణయాన్ని అమలు చేయడంపైనా ఎలాంటి ఆలోచనలుచేయడం లేదని కోర్టుకు తెలిపింది. 

సుమారు 400 మందికి పైగా వీఐపీలకు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించడం, ఆ మర్నాడే మూసేవాలా దారుణ హత్య కు గురవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలు తలెత్తడంతో పాటు వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. ఈ నేపథ్యంలోనే సీఎం భగవంత్‌ మాన్‌, పునరుద్ధరణ నిర్ణయం తీసుకున్నారు.

చదవండి: సిద్ధూ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం!

మరిన్ని వార్తలు