నేను ఆయనలా దేశ ద్రోహిని కాదు: సీఎం

6 Dec, 2020 14:34 IST|Sakshi

చంఢీఘడ్‌ : శిరోమణి అకాలీ దళ్‌ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బిర్‌ సింగ్‌ బాదల్‌ తనపై చేసిన వ్యాఖ్యలను పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌‌ తీవ్రంగా ఖండించారు. రైతుల ఉద్యమం విషయంలో తనను ఓ ఉత్త బఫూన్‌ అనటమే కాకుండా తన కుటుంబంపై ఉన్న ఈడీ కేసులను ప్రస్తావించటంపై మండిపడ్డారు. శనివారం బాదల్‌పై తిరుగు దాడి చేశారు. ‘‘ నేను బాదల్‌ లాగా వెన్నెముక లేని వాడిని, దేశ ద్రోహిని కాను. రైతులకు వారు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. (బీజేపీతో స్నేహం.. మరోసారి సీఎం అవుతా)

మీరు, మీ శిరోమణి అకాలీ దళ్‌ అధికార దాహంతో కళ్లు మూసుకుపోయి పాకిస్తాన్‌నుంచి మన రాష్ట్ర భద్రతకు పొంచి ఉన్న ముప్పును పట్టించుకోవటం లేదు. పంజాబ్‌ సరిహద్దుల వెంట భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, డ్రోన్లతో ఎలాంటి ప్రమాదం లేదని అంటారా?. నేను అకస్మాత్తుగా వణికిపోవటానికి నాపై ఎలాంటి ఈడీ కేసులు లేవు’’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు